తెలంగాణ చరిత్రలో మర్చిపోలేని రోజు సెప్టెంబర్ 17. ఒక ఉద్యమం.. ఉద్వేగం.. చరిత్రలో నిలిచిపోయిన సందర్భం.. పాత తరాల పోరాటానికి, భావితరాలు స్ఫూర్తి పొందడానికి వాస్తవంగా నిలిచిన ఉదాహరణ. ఆ రోజు TG సమాజం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యానికి మళ్లిన రోజు. నిరంకుశ నిజాంకు, ప్రజలకు మధ్య జరిగిన పోరు. కానీ, దాన్ని హిందూ ముస్లిం మతాల మధ్య గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం వివాదం రేపుతోంది.