ELR: నూజివీడు పట్టణంలోని శ్రీ వశిష్ట ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ కొనతం విజయబాబు యాదవ్కు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ వారు గుంటూరులో నిర్వహించిన పాన్ ఇండియా టీచర్ ఐకాన్ అవార్డు అందించారు. విజయబాబు ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికై పాన్ ఇండియా అవార్డు పొందడం పట్ల పలువురు ఉపాధ్యాయులు బుధవారం అభినందనలు తెలియజేశారు.