KDP: ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ కూడా ఓపీ సేవల నిలిపివేత కొనసాగించాయి. చర్చల తర్వాతే సేవలు తిరిగి ప్రారంభిస్తామని హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. సీఎఫ్ఎంఎస్లో పెండింగ్లో ఉన్న రూ. 674 కోట్లు కలిపి మొత్తం రూ. 3,800 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు.