MNCL: కోటపల్లి మండలంలోని ఎదులబంధం ఎక్స్ రోడ్ నుండి లింగన్నపేట గ్రామం మధ్య ఉన్న రోడ్డు గుంతలమయమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు . ఈ నేపథ్యంలో జనగామ గ్రామ మాజీ సర్పంచ్ గట్టు లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం రోడ్డుపై గుంతల్లో మట్టి పోసి మరమ్మతు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు దాగామ శ్రీశైలం పాల్గొన్నారు.