SKLM: ప్రజలకు అందించే భోజనం రుచిగా ఉండాలని ఆమదాలవలస మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి అన్నారు. బుధవారం రాత్రి ఆయన ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్నా క్యాంటీన్‌ను పరిశీలించారు. క్యాంటీన్లలో అందించే భోజనం నాణ్యతను, శుభ్రతను తనిఖీ చేస్తారు. క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని క్యాంటీన్ నిర్వహకులకు సూచించారు.