ASF: జల్ జంగల్ జమీన్ హక్కుల కోసం నిజాం ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచి సాయుధ పోరాటంలో వీర మరణం పొందిన గోండు వీరుడు కుమ్రంభీం వర్ధంతిని విజయవంతం చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పిలుపునిచ్చారు. జోడేఘాట్లో అక్టోబర్ 7న నిర్వహించనున్న కుమ్రంభీం వర్ధంతి ఏర్పాట్లను బుధవారం వారు పరిశీలించారు.