KNR: సైదాపూర్ మండలం రాయికల్లో ఉన్న పాత పోలీస్ ఠాణా, నిజాం కాలంలో జరిగిన హింసలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. దొరలు, రజాకార్ల చిత్రహింసలకు ఈ భవనం వేదికగా నిలిచింది. ఇనుప చువ్వల గదులు, ఇనుప మంచాలతో రూపొందించిన ఈ బందీఖానాలో పోరాట యోధులను చిత్రవధ చేశారు. ఈ భవనంపై ప్రజలు అనేకసార్లు దాడులు చేసి నిజాంను ఎదిరించారు. నేటికీ ఇది చెక్కుచెదరకుండా ఉంది.