VZM: పైడితల్లి అమ్మవారి సిరిమాను, ఇరుసు చెట్లకు గంట్యాడ మండలం, కొండతామరపల్లి గ్రామంలో వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ బుధవారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి బొట్టు పెట్టారు. చల్ల అప్పలనాయుడు కల్లంలో గుర్తించిన ఈ చెట్లకు ఉ 9.15 గంటలకు బొట్టు పెట్టే కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పూజారి వెంకటరావు, ఈవో శిరీష, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.