AP: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు నగర వనంలో మందుబాబులు వీరంగం సృష్టించారు. అటవీప్రాంతంలోని ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో మద్యం సీసాలు, మాంసాహారాలు తినుబండారాలను పడేశారు. దీంతో అక్కడి పరిస్థితిపై పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ సిబ్బంది పర్యవేక్షణ లేక వేటగాళ్లు జింకల వేట చేస్తున్నారని ఆరోపించారు.