GNTR: మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఉన్న ఎకో పార్కుకు వచ్చే వాకర్స్ వాకింగ్ ట్రాక్ నిర్వహణ సరిగా లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్‌పై రాళ్లు బయటపడటంతో నడవడానికి ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. వాకింగ్ ట్రాక్‌ను తక్షణమే మరమ్మతులు చేసి, నిర్వహణపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులను కోరారు.