VZM: కొత్తవలస పరిధిలోని తుమ్మికాపల్లి వద్ద ఉన్న సాయిరాం కాంప్లెక్స్‌లో ఓ దుకాణంలో బుధవారం ఉదయం ఆగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు గుర్తించి వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో నాలుగు ఫ్రీజ్‌లు, మూడు వాషింగ్ మిషన్లు దగ్ధం అయ్యినట్లు అగ్నిప్రమాద అధికారి అశోక్ కుమార్ తెలిపారు.