NRML: విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో అధ్యాపకులకు విద్యా ప్రమాణాలపై ఆర్జీయుకేటి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రో.. గోపాల్ కృష్ణ పాల్గొని విద్యార్థులు చదువును ఇష్టపడి నేర్చుకుంటే చదువు గొప్పతనం తెలుస్తుందని, అనిష్టంగా నేర్చుకున్నది ఏదీ కూడా దీర్ఘకాలంలో గుర్తుండదని అన్నారు. ఉపాధ్యాయలు పాల్గొన్నారు.