KMM: ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యాన ఈనెల 22 నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న నేపథ్యాన కేంద్రాల వద్ద ఆంక్షలు అమలు చేయనున్నట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. ఖమ్మంలోని రిక్కాబజార్, ప్రభుత్వ బాలికల హైస్కూళ్ల వద్ద ఉదయం 8నుంచి సాయంత్రం 6-30గంటల వరకు బీఎన్ఎస్ఎస్ యాక్ట్ -2023 అమల్లో ఉంటుందన్నారు. కేంద్రాల వద్ద గుంపులుగా ఉండొద్దని సూచించారు.