అన్నమయ్య: సచివాలయంలో మంగళవారం CM, DGP అధ్యక్షతన జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధి, పోలీసు వ్యవహారాలు, ప్రజా సమస్యలు, సాంకేతిక పరిపాలన, భద్రతా నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. అధికారులు తమ కార్యనిర్వహణను మరింత సమర్థవంతంగా చేయాలని సీఎం సూచించారు.