TG: హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీగా కొత్తగా సర్ఫరాజ్ అహ్మద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న ఎన్వీఎస్ రెడ్డికి ఉపశమనం లభించింది. రేవంత్ ప్రభుత్వం ఆయనకు ప్రభుత్వ సలహాదారు హోదా కల్పించింది. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగుతారు.