ATP: గుంతకల్లు పట్టణంలోని ధర్మవరం లెవెల్ క్రాసింగ్ గెట్ వద్ద ట్రాఫిక్ సమస్యతో మంగళవారం రాత్రి గుంతకల్లు నుంచి బెంగళూరుకు వెళ్తున్న వందే భారత్ రైలు 15 నిమిషాల పాటు నిలిచిపోయింది. గేట్ మెన్ రోడ్డు మీదకు వచ్చి వాహనాలను ఆపి గేటు వేయడంతో రైలు వెళ్లిపోయింది. గేటు వేసిన ప్రతిసారి 20 నిమిషాల పాటు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.