గుజరాత్‌కు చెందిన ఓ యువకుడు మృగేశ్ అసాధారణ రికార్డు సృష్టించాడు. బైక్‌పై 25 రోజుల్లో 6,300 కిలోమీటర్లు ప్రయాణించి, ప్రపంచంలోనే ఎత్తైన రహదారి అయిన ఉమ్లింగ్ లా పాస్‌కు చేరుకున్నాడు. సముద్ర మట్టానికి 19,024 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశానికి చేరుకోవడంలో మృగేశ్ అనేక సవాళ్లను అధిగమించాడు. ఈ ఘనతకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు.