TG: MBBS, BDS అడ్మిషన్లలో స్థానికతపై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రానికి చెందిన తనకు స్థానిక కోటాలో సీటు కేటాయించలేదని నీట్ అభ్యర్థి శశి కిరణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. వివరణ ఇచ్చేందుకు 24 గంటల సమయం ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.