తన 75వ పుట్టినరోజు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినందుకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. తన మిత్రుడు ట్రంప్ లాగే తానూ భారత్-అమెరికా బంధం కొత్త శిఖరాలకు చేరుకోవడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం ట్రంప్ చేసే ప్రయత్నాలకు భారతదేశం మద్దతు ఇస్తుందని కూడా మోదీ స్పష్టం చేశారు.