AP: TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డిపై అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అసత్యాలు ప్రచారం చేసిన నేపథ్యంలో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అలిపిరి సమీపంలోని విష్ణుమూర్తి విగ్రహంపై భూమన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని డిప్యూటీ ఈవో గోవిందరాజు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదైంది.