ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తుంది అంటూ… అధికారం చేపట్టిన 50 రోజుల్లో 36 ముర్దార్లు జరిగాయని వైసీపీ అధినేత వై ఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేసిన సంగతి తెలిసిందే… 11మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో, ముఖ్య నాయకులతో జగన్ ఢిల్లీలో ధర్నాకు దిగారు. జగన్ కు మద్దతుగా ఎంతోమంది జాతీయ నాయకులు, అఖిలేష్ యాదవ్ లాంటి ముఖ్య నాయకులూ మద్దత్తు ప్రకటించారు.
ఈ ధర్నాకు సొంత పార్టీకు చెందిన ఇద్దరు నాయకులు డుమ్మా కొట్టారు. ఎమ్మెల్సీలు తూమాటి మాధవ రావు, వంక రవీంద్రలు ఢిల్లీ వెళ్లకుండా శాసనమండలిలో కనిపించారు. వారిని కొంతమంది టీడీపీ ఏమ్మెల్సీలు ఈ విషయంపై ఆరాతీయగా సరైన సమాధానం రాలేదు.
ఈ ఘటన రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది. వైసీపీ నాయకులలో అప్పుడే పార్టీ మారే ఆలోచనలు వస్తున్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు, సోషల్ మీడియా లో టీడీపీ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.