»A Partys Attempt To Prevent Coalition Rule In Ap Nagababu Sensational Tweet
Nagababu: ఏపీలో కూటమి పాలనను అడ్డుకునేందుకు ఓ పార్టీ ప్రయత్నం చేస్తుందని ట్వీట్
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనను సరిగా సాగనీయకుండా ఓ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ పార్టీ ఏంటో అందరికీ తెలిసిందే అని జనసేన నేత నాగబాబు ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు.
A party's attempt to prevent coalition rule in AP.. Nagababu sensational tweet..!
Nagababu: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనను సరిగా సాగనీయకుండా ఓ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ పార్టీ ఏంటో అందరికీ తెలిసిందే అని జనసేన నేత నాగబాబు ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ఏపీలో గొడవలు, అల్లర్లు, హింసాత్మక ఘటనల కోసం జిల్లాలకు డబ్బులు సమకూరుస్తున్నారని అన్నారు. దీన్ని కచ్చితంగా రాష్ట్ర ప్రజలు గమనించాలని, అలాగే అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.
“కూటమి ప్రభుత్వపు తాలుకు పరిపాలన సజావుగా జరగకుండా ఉండటానికి రాష్ట్రంలో అల్లర్లు,గొడవలు హింసాత్మక సంఘటనలు చేయటానికి ప్రతి జిల్లాకి 10 కోట్ల చొప్పున రాబోయే రెండేళ్ల కాలనికి ఖర్చు పెట్టడానికి ఒక పార్టీ ప్రయత్నిస్తోంది,
అది ఏ పార్టీ అని మీకు చెప్పనక్కర్లేదు,
మాకొచ్చిన సమాచారం ఇది..
మీరు జిల్లాకి పదికోట్ల చొప్పొన 13 ఉమ్మడి జిల్లాలకి 130 కోట్లు అదే సంవత్సరానికి 1500 కోట్లు ఖర్చు పెట్టేబదులు ఆ డబ్బు సామన్యుల సంక్షేమానికి మీరు చేసిన పాపాలు కడుక్కోటానికి ఖర్చు పెట్టుంటే కొంతలో కొంతైన మీమీద సింపతీ వచ్చేది కాని
ఇలా అల్లర్లు చేసేస్తే తద్వార మధ్యంతర పరిపాలన వచ్చేస్తది అనుకునే పనికిమాలిన ఆలోచనలు మానుకోండి, మీ క్రూర వ్వవహారాలేవి మాదాక రావు అనుకోకండి,
వీటిని ధీటుగా ఎదుర్కుంటాం కాకపోతే మీకు నేనిచ్చే ఒక మంచి సలహా ఏంటంటే ఆ హింసాత్మక చర్యలకి పెట్టే ఆ డబ్బుని పేదల కోసం పెడితే వారి పురోగతి కోసం పెడితే కనీసం ఈసారి ప్రతిపక్ష హోదా అయిన దక్కుద్ది,
ఇదే నా సలహా పాటిస్తే మంచిది పాటించకపోతే కూటమి ప్రభుత్వానికి మీ కుట్రలని ఎలా అరికట్టాలో బాగా తెలుసు..!” అని నాగబాబు ట్వీట్ చేశారు.
కూటమి ప్రభుత్వపు తాలుకు పరిపాలన సజావుగా జరగకుండా ఉండటానికి రాష్ట్రంలో అల్లర్లు,గొడవలు హింసాత్మక సంఘటనలు చేయటానికి ప్రతి జిల్లాకి 10 కోట్ల చొప్పున రాబోయే రెండేళ్ల కాలనికి ఖర్చు పెట్టడానికి ఒక పార్టీ ప్రయత్నిస్తోంది, అది ఏ పార్టీ అని మీకు చెప్పనక్కర్లేదు, మాకొచ్చిన సమాచారం ఇది..…