»Vijayasai Reddy Comments On The Allegations Of Illegal Relationship Coming Against Him
Vijayasai Reddy: అన్ని చూస్తూనే ఉన్నాము.. అందరి తోకలు కట్ చేస్తా
ఓ మహిళ అధికారితో వైసీపీ రాజ్యసభసభ్యుడు విజయసాయి రెడ్డి అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే వార్తలు వైరల్‌గా మారాయి. తాజాగా దీనిపై ఆయన ప్రెస్‌మీట్ పెట్టాడు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని ఇప్పుడు తోకలు జాడిస్తున్న వారితోకలు కత్తిరిస్తా అని వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి.
Vijayasai Reddy comments on the allegations of illegal relationship coming against him
Vijayasai Reddy: ఓ మహిళా అధికారితో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి అక్రమ సంబంధం ఉందని సోషల్ మీడియాలో, మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా విజయసాయిరెడ్డి ప్రెస్‌మీట్ పెట్టాడు. ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు వార్తలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ఆదివాసీ మహిళతో తనకు అక్రమ సంబంధం ఉందని తనను అవమానించడమే కాకుండా ఆ ఆడబిడ్డ పరువు తీయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని మీడియా ఛానెళ్లు తనపై విష ప్రచారం చేస్తున్నాయని, సత్యం ఏంటో తెలియకుండా ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నాయని కొప్పడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ అరచాకాలు మొదలయ్యాయి అని, ముఖ్యంగా వైసీపీ నాయకులపై వరుస దాడుడు చేస్తున్నారు. వారిపై బురద చల్లుతున్నారని పేర్కొన్నారు. కేవలం సహాయం కోసం వచ్చిన మహిళా అధికారితో తనకు సంబంధం పెడుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తండ్రిలాంటి వాడని ఆ అధికారి చెప్పిన మాటలు గుర్తుచేశారు. దీంతో తన పరువు, ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్ర పన్నారని వెల్లడించారు. మీడియా దిగ్గజం రామోజీరావునే ఎదుర్కొన్నా అని, ఈ కుట్ర వెనుక ఉన్న వాళ్లెవరైనా వారికి తగిన బుద్ధి చెబుతా అని మండిపడ్డారు. దీనిపై పరువు నష్టం దావా వేస్తానన్నారు.
అంతేకాకుండా పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తానని.. ప్రైవేట్ మెంబర్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడతానని తెలిపారు. తాము ఎప్పుడూ ఎవరికీ భయపడలేదని చెప్పారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని, మధ్యంతర ఎన్నికలు వచ్చినా వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పారు. వీరి అండదండలు చూసుకొని చాలామంది తోకలు జాడీస్తున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి తోకలు కత్తిరిస్తామని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నా తాము తగ్గేదే లే అని, కూటమి రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.