కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచే ప్రతిపాదనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దీనిపై స్పందించారు.
KTR: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచే ప్రతిపాదనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దీనిపై స్పందించారు. ఏదైనా ఉచితంగా ఇస్తామంటున్నారంటే మరో ఆలోచనతో తీసుకెళ్తున్నట్లేనని తెలిపారు. ఉచితంగా ఇస్తామన్నారంటే దానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. బస్సు ఛార్జీల పెంపుపై కర్ణాటకను తెలంగాణ అనుసరించే రోజు ఎంతో దూరంలో లేదని కేటీఆర్ అన్నారు.
Remember when someone says “it’s Free”, they are taking you for a ride
There’s always a heavy price for anything that you are told is “Free”
The day is not far when Telangana RTC will also follow in the footsteps of Karnataka and increase Bus Fares https://t.co/GR8YYPKECT
త్వరలో రాష్ట్రంలో బస్సు ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. ఈ విషయంపై కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ ఎస్ఆర్ శ్రీనివాస్ తెలిపారు. బస్సు ఛార్జీలను 15-20 పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేఎస్ఆర్టీసీ ఇప్పటికే ప్రతిపాదనలు పంపిందని తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన బోర్డు సమావేశంలో బస్సు ఛార్జీలను పెంచాలని ప్రతిపాదనలు తీసుకొచ్చారు. కేఎస్ఆర్టీసీ మనుగడ సాధించాలంటే, ఛార్జీల పెంపు తప్పనిసరని శ్రీనివాస్ తెలిపారు. ఇంధన, బస్సుల విడి పరికరాల ధరలు పెరిగాయి. గత మూడు నెలల కాలంలో కార్పొరేషన్‌కు రూ.295 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు.