»President Droupadi Murmu Assumes The Role Of Teacher
President : టీచర్‌గా మారిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయురాలి అవతారం ఎత్తారు. ఢిల్లీలోని ఓ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్లో వైరల్‌గా మారింది.
President Droupadi Murmu : ఎప్పుడూ అధికారిక కార్యకలాపాలతో బిజీ బిజీగా ఉండే భారత రాష్ట్రపతి( President ) ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ఉన్నట్లుండి టీచర్ అవతారం ఎత్తారు. ఢిల్లీలోని ఓ పాఠశాలలో పిల్లలకు సరదాగా పాఠాలు చెప్పారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారు ఏం చెబుతున్నదీ ఆసక్తిగా విన్నారు. ఈ అరుదైన ఘటన ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్‌లో ఉన్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో చోటు చేసుకుంది. గురువారం ఉదయం ముర్ము ఈ కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె ఓ తరగతి గదిలోకి వెళ్లారు. విద్యార్థులకు మంచి విషయాలను చెప్పారు. పిల్లలను కొన్ని ప్రశ్నలు అడిగారు. పాఠశాలలో అందుతున్న విద్య, సౌకర్యాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్లోకి రాగానే వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం ఈ వీడియోకి ఉత్సాహంగా కామెంట్లు రాశారు. ఈ విద్యార్థులు ఎంత అదృష్టవంతులో అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా మరొకరు ‘గ్రేట్ ప్రెసిడెంట్’ అంటూ కామెంట్ చేశారు. మరింకెందు కాలస్యం? ఆ వీడియోపై మీరూ ఓ లేక్కేయండి.
#WATCH | President Droupadi Murmu assumes the role of teacher and interacts with students of Dr. Rajendra Prasad Kendriya Vidyalaya, Sch-B, President’s Estate in Delhi