Assam: క్లాస్‌లోనే టీచర్ని కత్తితో పొడిచిన విద్యార్థి
అస్సాంలో దారుణమైన ఘటన జరిగింది. విద్యార్థి టీచర్‌ను దారుణంగా హత్య చేశాడు. ప్రకాశం జిల్లాకు చెందిన రాజేశ్‌బాబు రసాయన శాస్త అధ్యాపకుడిని విద్యార్థి కత్తితో పొడిచాడు.
Assam: అస్సాంలో దారుణమైన ఘటన జరిగింది. విద్యార్థి టీచర్‌ను దారుణంగా హత్య చేశాడు. ప్రకాశం జిల్లాకు చెందిన రాజేశ్‌బాబు రసాయన శాస్త అధ్యాపకుడు. విశాఖలోని ఓ ప్రైవేటు కళాశాలలో పనిచేశారు. ఆ తర్వాత అస్సాంలో సొంతంగా కళాశాల ఏర్పాటు చేశారు. పదమూడేళ్ల నుంచి ఆయన ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తుండగా.. భార్య అపర్ణ డైరెక్టర్‌గా ఉన్నారు. కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థికి గణితంలో మార్కులు తక్కువగా వచ్చాయి. అలాగే అతని ప్రవర్తన కూడా సరిగ్గా లేదు. దీంతో గణిత అధ్యాపకుడు అతనిని మందలించారు. ఇంటికెళ్లి పెద్దలను తీసుకురావాలని తెలిపారు.
ఆ సమయంలో ప్రిన్సిపల్ రాజేశ్‌బాబు కూడా అక్కడే ఉన్నారు. దీన్ని అవమానంగా భావించిన ఆ విద్యార్థి సాయంత్రం కత్తి తెచ్చుకుని తరగతి గదిలో కూర్చున్నాడు. రాజేశ్‌బాబు కెమిస్ట్రీ క్లాస్ చెబుతుండగా, ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. తల, ఛాతీపై పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. కళాశాల సిబ్బంది బాధితుడిని వైద్యశాలకు తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయారు. రాజేశ్‌బాబు దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రమానికి తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తిచేశారు. దాడికి పాల్పడ్డ విద్యార్థి తండ్రి చనిపోయాడు. తల్లి మాత్రమే ఉంది. తండ్రికి నేరచరిత్ర ఉన్నట్లు తర్వాత తెలిసిందని మృతుడి సోదరుడు నవీన్ తెలిపారు.