ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు కరువయ్యాయని భారత రాష్ట్రపతి ద్రౌపది మర్ముకు వైసీపీ విజ్ఞప్తి చేసింది. ప్రజలను రక్షించాలని పార్టీ అధికారిక ఎక్స్ పేజీలో ట్వీట్ చేసింది.
Law and order has deteriorated in AP. YSP appeals to President Draupathi Murmu
Draupathi Murmu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, ఎలాగైనా రాష్ట్రప్రజలను ఆదుకోవాలని భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు వైసీపీ విజ్ఞప్తి చేసింది. ‘మేడం ప్రెసిడెంట్.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది వెరీ బ్యాడ్ మార్నింగ్’ అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి ట్వీట్ చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని, వైసీపీ కార్యకర్తలు భయాందోళనలతో జీవిస్తున్నారని పేర్కొన్నారు. దయచేసిన రాష్ట్రపతి కలగజేసుకోవాలని ట్వీట్లో వెల్లడించారు. పల్నాడు జిల్లా వినుకొండలో ఓ వైసీపీ కార్యకర్త దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. దాని తరువాత అక్కడి స్థానికుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో వైసీపీ అధిష్ఠాను ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి చేసింది. ఈమేరకు గురువారం ఉదయం వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్టు పెట్టింది.
ఏపీలో జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని, ప్రతీ భారతీయుడు తమకు మద్దతు ఇవ్వాలని వైసీపీ కోరింది. దీనిపై రాష్ట్రపతి జోక్యం చేసుకోకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా మారే అవకాశం ఉందని ఆరోపించారు. వినుకొండలో రషీద్ వైసీపీ కార్యకర్త బుధవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు స్పందిస్తూ.. ఇవి పాత కక్షలు అని, ఇదివరకే ఇరువర్గాల నడుమ చాలా కేసులు ఉన్నాయని తెలిపారు. దీనిపై వేసీపీ నేతలు నిరసనలు వ్యక్తం చేశారు. ఇలాగే ఊరుకుంటే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలకు ప్రాణహాని ఉంటుందని ఆరోపించారు. దయచేసి ఏపీలో శాంతిభద్రతలకు కాపాడాలని రాష్ట్రపతిని కోరారు.