»Bhole Baba On Hathras Stampede Hathras Stampede Bhole Baba Return Back To His Ashram
Hathras Stampede : హథ్రస్ తొక్కిసలాట.. ఆశ్రమానికి తిరిగి వచ్చిన భోలే బాబా
హథ్రస్ తొక్కిసలాటలో 121 మంది చనిపోయిన ఉదంతం జరిగిన తర్వాత భోలే బాబా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగిన 15 రోజుల తర్వాత ఆయన తిరిగి తన ఆశ్రమానికి వచ్చారు. ఘటనపై స్పందించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Hathras Stampede : హథ్రస్ తొక్కిసలాట ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన భోలే బాబా ఇప్పుడు ఎట్టకేలకు తన ఆశ్రమానికి తిరిగి వచ్చారు. ఘటనపై స్పందించారు. ఇప్పటి వరకు పలు మీడియాల ద్వారా ఘటనపై స్పందించినప్పటికీ ఆయన ఎక్కడ ఉన్నారన్న విషయం బయటకు రాలేదు. అయితే ఆయన ఇప్పుడు తిరిగి తన ఆశ్రమానికి(ashram) చేరుకున్నారు. ఘటనపై స్పందించారు. ఆయన ఏమన్నారంటే?
జూలై రెండో తారీఖున హథ్రస్లో జరిగిన తొక్కిసలాట(Hathras Stampede) ఘటన గురించి తాను చాలా బాధ పడినట్లు భోలే బాబా(Bhole Baba) అన్నారు. జరిగే వాటిని ఎవరూ ఆపలేరని అన్నారు. భూమి మీదకు వచ్చిన వారు ఏదో ఒక రోజున వెళ్లిపోవాల్సిందేనని తెలిపారు. ఈ ఘటన వెనక ఏదో కుట్ర దాగి ఉండటం నిజమనిపిస్తోందని అన్నారు. తనకు న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.
ఈ ఘటన ద్వారా అన్యాయం అయిన కుటుంబాలకు తాను అండగా నిలుస్తానని భోలేబాబా హామీ ఇచ్చారు. ప్రస్తుతం తమ ఊరు అయిన కాస్గంజ్లోని బహదూర్ నగర్లో ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 2న హథ్రస్లో ‘సత్సంగ్’(satsang) కార్యక్రమం జరిగింది. దీనికి ఆధ్యాత్మికవేత్త అయిన భోలేబాబా(Bhole Baba) వచ్చారు. ఈ కార్యక్రమానికి 80వేల మంది వరకు హాజరు అవుతారని నిర్వాహకులు భావించారు. అయితే ఊహకు అందనంత ఎక్కువగా ఏకంగా రెండున్నర లక్షల మంది హాజరయ్యారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుని 121మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఈ సంఘటనపై కేసుల దర్యాప్తు జరుగుతోంది.