»Bhole Baba What Is The Value Of Bhole Babas Assets
Bhole Baba: భోలే బాబా ఆస్తుల విలువ ఎంతంటే?
ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లాలో భోలే బాబా పాద మట్టి కోసం పోటీపడి తొక్కిసలాట అయ్యి 121 మంది మరణించారు. ఈ ఘటనకి కారణమైన ఆరుగురిని ఇప్పటివరకు అరెస్టు చేశారు. అయితే భోలే బాబా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మరి అతని ఆస్తుల విలువ ఎంతో వివరాల్లో తెలుసుకుందాం.
Bhole Baba: What is the value of Bhole Baba's assets?
Bhole Baba: ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లాలో భోలే బాబా పాద మట్టి కోసం పోటీపడి తొక్కిసలాట అయ్యి 121 మంది మరణించారు. ఈ ఘటనకి కారణమైన ఆరుగురిని ఇప్పటివరకు అరెస్టు చేశారు. అయితే భోలే బాబా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇప్పటివరకు అతని ఆచూకీ లభించలేదు. అతని కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు గాలిస్తున్నారు. ఈక్రమంలో అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. భోలే బాబాకు దేశవ్యాప్తంగా 24 ఆశ్రమాలు ఉన్నట్లు సమాచారం. అవన్నీ అత్యధికంగా యూపీలోనే ఉన్నాయి. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.100 కోట్లు వరకు ఉంటుందని సమాచారం.
శ్రీ నారాయణ్ హరి సాకార్ ఛారిటబుల్ ట్రస్ట్ పేరుతో వీటిని నిర్వహిస్తున్నారు. నిత్యం తెలుపు రంగు దుస్తులు, టై, కళ్లద్దాలతో కనిపిస్తుంటారు. అనుచరులకు దర్శనమిచ్చే సమయంలో భారీ పరేడ్‌తో వస్తారు. దాదాపు 16 మంది వ్యక్తిగత కమాండోలు ఆయన కారుకు ముందు 350 సీసీ బైక్‌లపై ప్రయాణిస్తూ దారిని క్లియర్ చేస్తారు. వెనుక 15-30 కార్లతో ఆయన కాన్వాయ్ ఉంటుంది. తెల్లటి టయోటా ఫార్చునర్ కారులో ప్రయాణిస్తారు. కారుతో పాటు ఇంటీరియర్ కూడా పూర్తిగా తెలుపు రంగులో ఉంటుందట. సూరజ్‌పాల్ మెయిన్‌పురిలో ఆశ్రమం ఉంటుంది. హరి నగర్‌గా పిలిచే ఈ ఆశ్రమం 13 ఎకరాల్లో విస్తరించి ఉంది. బాబా ఆయన భార్య కోసం అందులో ఆరు విలాసవంతమైన గదులు ఉంటాయని సమాచారం.