జమ్మూకాశ్మీర్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. ఎల్ఓసీ వెంట ఉన్న 80 గ్రామాల్లో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. పాకిస్తాన్ ఏకంగా 72 టెర్రర్ లాంచ్ ప్యాడ్లను యాక్టివ్ చేయడంతో సరిహద్దులో గట్టి నిఘా పెట్టారు. శ్రీనగర్‌లోనూ ఆర్మీ సోదాలు ముమ్మరం చేసింది. కాశ్మీర్‌తో పాటు పంజాబ్ బోర్డర్‌లోనూ హైఅలర్ట్ కొనసాగుతోంది.