బాపట్ల: కొరిశపాడు మండలం మేదరమెట్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం చిల్డ్రన్స్ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించారు. విద్యార్థులే ఎన్నికల అధికారులుగా బాధ్యతలు నిర్వహించి ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికల్లో నిలబడిన విద్యార్థులకు తోటి విద్యార్థులు ఓట్లు వేసి పార్లమెంట్ అభ్యర్థిని ఎన్నుకున్నారు.