GDWL: ప్రతి వినియోగదారుడు తన హక్కులను ఆయుధంగా మలుచుకున్నప్పుడే మార్కెట్లో మోసాలకు అడ్డుకట్ట పడుతుందని ఎంఎఎల్ డి కళాశాల ప్రిన్సిపాల్ డా. కలందర్ బాషా పిలుపునిచ్చారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం (డిసెంబర్ 24) పురస్కరించుకుని గద్వాల మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆస్రా జోగులాంబ బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.