KNR: గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ సామాజిక కార్యకర్త చెన్నోజుల మునిందర్ మంగళవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు వినతిపత్రం అందజేశారు. బూరుగుపల్లి పది గ్రామాలకు కేంద్ర బిందువుగా ఉందని, ఇక్కడి నుండి కరీంనగర్‌కు వెళ్లే ప్రజలు బస్సుల్లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.