WGL: చెన్నారావుపేట (M) కేంద్రంలోని జల్లి గ్రామపంచాయతీ ఆవరణంలో ఇవాళ జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ యాట సుధాకర్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి రైతులు వెన్నుముకలని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి గ్రామపంచాయతీ స్థాయిలో అన్ని విధాలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, బాబు, తదితరులు పాల్గొన్నారు.