టీ20 వరల్డ్ కప్ గెలిచిన తరువాత సీనియర్స్ ప్లేయర్స్ అంతా ఈ పొట్టి ఫార్మెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం వాంఖడే స్టేడియంలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న బుమ్రా తన రిటైర్మెంట్పై స్పందించారు. ఆయన నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు.
Jasprit Bumrah: టీ20 వరల్డ్ కప్ గెలవడం టీమిండియాకు గొప్ప గర్వకారణం. 17 సంవత్సరాల తరువాత ట్రోఫీని గెలవడంతో గురువారం సాయంత్రం ముంబయి నగరంలోని వాంఖడే స్టేడియం సెలబ్రేషన్స్‌తో మునిగిపోయింది. అయితే వరల్డ్ కప్ సాధించిన తరువాత టీమ్‌లోని సీనియర్ ప్లేమర్స్ అంతా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవింద్ర జడేజా ఈ పొట్టి ఫార్మెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ గెలిచిన వెంటనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తరువాత రోజు జడేజా కూడా తన రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా రిటైర్మెంట్ ఇస్తారా అనే వార్తలు వచ్చాయి. దీనిపై బుమ్రా స్వయంగా స్పందించారు.
టీ20 వరల్డ్ కప్ సెలబ్రేషన్స్‌లో భాగంగా టీమంతా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో వేడుక జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్లేయర్ ఆఫ్ ది సరీస్ అందుకున్న బుమ్రా తన రిటైర్మెంట్పై మాట్లాడారు. తాను కెరీర్ ఇప్పుడే స్టార్ట్ చేశాను అని, ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచన లేదు అని చెప్పారు. తన జీవితంలో వరల్డ్ కప్ ఎప్పుడూ గెలవేలదని, ఈ ఆనందం ఎంతో బాగుందని పేర్కొన్నారు. ఇక వాంఖడే స్టేడియం తనకు ఎంతో స్పెషల్ అని చెప్పారు. అండర్ 19 ప్లేయర్‌గా మొదటి సారి ఈ గ్రౌండ్‌లోనే అడాను అని, భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేక పోతున్నట్లు చెప్పారు. ఇప్పటికీ తాను ఒక యువ ప్లేయర్‌గానే భావిస్తున్నట్లు పేర్కొన్నారు. టీమ్‌లో సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీమ్‌ను ముందుండి నడిపించారు. వారికి ఏ సమయంలో ఎలా ఉండాలో తెలుసు కాబట్టి టీమ్‌ను చాలా కూల్‌గా డ్రైవ్ చేశారు. అందుకే మొదటి నుంచి ప్రతీ మ్యాచ్ గెలుచుకుంటూ వచ్చామని చెప్పారు. ఆయన రిటైర్మెంట్ గురించి కోహ్లీ మాట్లాడుతూ.. బుమ్రా ప్రతిభవంతుడైన బౌలర్, తాను ఎప్పటి వరకు ఆడాలనిప్తే అప్పటి వరకు ఆడించండి అని చెప్పారు.