టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా నేడు స్వదేశానికి చేరుకొని ప్రధాని మోడీని కలిసింది. ఈ సందర్భంగా బీసీసీఐ ప్రధానికి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ బహుమతి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
BCCI: టీ20 వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియా నేడు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరకున్నారు. అనంతరం 11 గంటలకు మోడీ నివాసంలో రోహిత్ సేన సమావేశం అయ్యారు. ప్రధానితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా మ్యాచ్‌కు సంబంధించిన అనేక విషయాలను, జ్ఞాపకాలను మోడీతో పంచుకున్నారు. ఈ సందర్భంగా బీసీసీఐ ఓ స్పెషల్ గిఫ్ట్‌ను మోడీకి అందించింది. నమో నం. 01 పేరిట ఓ ప్రత్యేకమైన టీమిండియా జెర్సీని అందజేసింది. జట్టు సభ్యులు, బీసీసీఐ సెక్రటరీ జైషా, అధ్యక్షుడు రోజర్ బిన్నీ అందరూ కలిసి మోడీకి అందించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు టీమందరితో నవ్వులు చిందిస్తూ కనిపించారు.
అదే విధంగా ప్రపంచ కప్ ఫైనల్ రోజున కూడా ప్రధాన మంత్రి ఇండియన్ టీ 20 క్రికెట్ టీం ప్లేయర్లతో ఫోన్లో ఆల్‌ద బెస్ట్ చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పడు కప్‌తో వచ్చిన టీమ్‌ను ఆమన ఘనంగా సత్కరించారు. ఇక ప్రధానితో భేటీ పూర్తిగానే ఆటగాళ్లు ముంబయి బయలుదేరారు. ఈ సాయంత్రం ముంబయిలో రోడ్ షో చేసిన తరువాత వాంఖడే క్రికెట్ స్టేడియంలో ప్లేయర్స్ ఘన సత్కారం ఉంటుంది. దాదాపుగా 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ నెగ్గింది. ఈ సందర్భంగా ముంబయి నగరం అంతా క్రికెట్ అభిమానులతో కిటకిటలాడుతుంది.