PM Modi: ఎన్డీయే సర్కారు మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పరుచుకుంది. అయితే ఈక్రమంలో బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో మోదీ మాట్లాడుతూ.. కొన్ని పార్టీల ప్రతికూల రాజకీయాలు పార్లమెంట్ సమయాన్ని వృథా చేశాయన్నారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొనాలని పార్టీల ఎంపీలకు విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనల గురించి స్పష్టంగా మోదీ ప్రస్తావించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని రాజ్యాంగ విరుద్ధంగా నిశ్శబ్దం చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ప్రధానిని రెండున్నర గంటల పాటు నోటికొచ్చినట్లు మాట్లాడే ప్రయత్నాలకు ప్రజాస్వామ్య సంప్రదాయాల్లో స్థానం ఉండదని, పశ్చాత్తాపం లేదన్నారు.
భారత ప్రజాస్వామ్యం అద్భుతమైన ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి. దాదాపు 60 సంవత్సరాల తర్వాత ఒక ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చి మూడవసారి తన మొదటి బడ్జెట్ను సమర్పించినందుకు మేము గర్విస్తున్నామని మోదీ అన్నారు. ఈ బడ్జెట్ చాలా ముఖ్యమైనది. వికసిత్ భారత్కు పునాది వేస్తుందని తెలిపారు.