Team India meets Prime Minister : వరల్డ్ కప్ గెలుచుకున్న భారత క్రికెటర్లు నేడు దేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. దిల్లీలో ఘన స్వాగతం అందుకున్న ప్లేయర్లు ఆ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని(Narendra Modi) కలుసుకున్నారు. ఆయనతో కలిసి క్రికెట్ టీం(Team India) ఆటగాళ్లంతా బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఈ సమయంలో మోదీ వీరందరితోనూ సరదాగా మాట్లాడారు. ఆప్యాయంగా మాట కలిపారు. కప్ గెలుచుకుని వచ్చినందుకు వారికి అభినందనలు తెలిపారు. వారందరితో కలిసి నవ్వులు చిందిస్తూ ఫోటోలు దిగారు.
చదవండి : ఆరోగ్యంగా ఉండేందుకు అసలు రోజుకు ఎంత సేపు నడవాలి?
ప్రపంచ కప్ ఫైనల్ రోజున కూడా ప్రధాన మంత్రి ఇండియన్ టీ 20 క్రికెట్ టీం ప్లేయర్లతో ఫోన్లో మాట్లాడారు. ఆల్‌ద బెస్ట్ చెప్పారు. ఆ తర్వాత వీరు కప్పు గెలవడంతో ఇలా దిల్లీ చేరుకోగానే ప్రధానిని( Prime Minister) గౌరవప్రదంగా కలిసి వచ్చారు. ప్రధానితో భేటీ పూర్తిగానే ఆటగాళ్లు నేరుగా విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి ముంబయి చేరుకుంటారు. ఈ సాయంత్రం ఐదు గంటలకు ముంబయిలో రోడ్ షో చేస్తారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు సైతం పూర్తి కావచ్చాయి. ముంబయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు విజయోత్సవ ర్యాలీ జరిగే రోడ్లలో భారీగా మోహరించారు.
చదవండి : అస్సాంలో వరదల బీభత్సం.. 16లక్షల మంది నిరాశ్రయులు
భారత క్రికెట్ టీం దాదాపుగా 11 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ నెగ్గింది. చివరిసారిగా ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని టీం ప్రపంచ కప్‌ని సొంతం చేసుకుంది. అలాగే టీ20 ప్రపంచ కప్‌ని(T20 World Cup) అయితే దక్కించుకోవడానికి దాదాపుగా 17 ఏళ్లు పట్టింది. ఇంత సుదీర్ఘ కాలం తర్వాత కప్పును కొట్టుకుని రావడంతో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.

