»Firing At Trump Prime Minister Narendra Modi Is Deeply Worried
Narendra Modi: ట్రంప్‌పై కాల్పులు.. ప్రధాని నేరంద్ర మోడీ తీవ్ర ఆందోళన
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటన అందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు.
Firing at Trump.. Prime Minister Narendra Modi is deeply worried
Narendra Modi: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ప్రపంచమే ఒక్క సారిగా విస్తూ పోయింది. దీనిపై భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసకు తావులేదన్నారు. తన స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఫైరింగ్ జరగడం తీవ్ర ఆందోళనను కలిగించిందని వ్యాఖ్యానించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు.
“నా స్నేహితుడు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి పట్ల తీవ్ర ఆందోళనవ్యక్తం చేస్తున్నాను. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ ప్రమాదంలో గాయపడిన, మరణించిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.” అంటూ రాసుకొచ్చారు.
శనివారం అగ్రరాజ్యంలో ప్రపంచమే ఉలిక్కిపడే ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ప్రసంగిస్తుండగా గన్ ఫైర్ జరిగింది. ఈ కాల్పుల్లో ట్రంప్‌కు చెవికి గాయం అయింది. తీవ్ర రక్తస్రావం అయింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ దాడికి పాల్పడిన నిందితుడిని యూఎస్ సీక్రెట్ ఏజెంట్స్ క్షణాల్లోనే హతం చేశారు. ట్రంప్‌పైకి బులెట్ దూసుకెళ్లిన క్షణంలోనే నిందితుడిని ఓ స్నైపర్ షూటి చేశాడు.
Deeply concerned by the attack on my friend, former President Donald Trump. Strongly condemn the incident. Violence has no place in politics and democracies. Wish him speedy recovery.
Our thoughts and prayers are with the family of the deceased, those injured and the American…