Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఎప్పుడంటే?
రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ సాధించిన తర్వాత ఈ విషయాన్ని తెలిపారు. అయితే రోహిత్ వర్మ ఈ ఏడాది 37 ఏళ్ల వయస్సులోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇక కెరీర్‌కు గుడ్‌బై చెప్పే సమయం దగ్గరపడిందంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
Rohit Sharma: రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ సాధించిన తర్వాత ఈ విషయాన్ని తెలిపారు. కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుంటుండగా తన నిర్ణయాన్ని తెలిపారు. రోహిత్ మ్యాచ్ అయిన తర్వాత మీడియా సమావేశంలో తెలిపారు. దీంతో రోహిత్ రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే రోహిత్ వర్మ ఈ ఏడాది 37 ఏళ్ల వయస్సులోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇక కెరీర్‌కు గుడ్‌బై చెప్పే సమయం దగ్గరపడిందంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని బీసీసీఐ సెక్రటరీ జైషా ఇటీవల స్పష్టం చేశారు. కానీ రోహిత్ మాత్రం ఇంకొంత కాలం ఆడతానని తెలిపారు. రిటైర్మెంట్ కోసం సుదీర్ఘ ప్ర్రణాళికలేమీ లేవని తెలిపారు. డాలస్‌లో క్రికెట్ అకాడమీ ప్రారంభానికి వెళ్లిన ఆయన అక్కడ అభిమానులు అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు. రోహిత్ శర్మ ఐపీఎల్లో మాత్రం కొనసాగనున్నారు. ఈ నెలలోనే టీమ్ఇండియా శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది. ఈ సిరీస్ నుంచి రోహిత్, కోహ్లీకి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వరుస సిరీస్‌లతో టీమ్ఇండియా బిజీబిజీగా ఉండనుంది.