T20 World Cup Victory Celebration in Mumbai on 4th July
T20 World Cup Celebration: 17 ఏళ్ల తరువాత భారత్ టీ20 వరల్డ్ కప్ సాధించింది. ఈ వేడుకను అత్యంత అట్టహాసంగా జరపడానికి ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక కానుంది. జులై 4న స్టేడియంలో విజయోత్సాహంతో దద్దరిల్లిపోవాలని, క్రికెట్ అభిమానులను ఆహ్వానిస్తూ బీసీసీఐ కార్యదర్శి జయ్ షా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
“టీమ్ ఇండియా ప్రపంచ కప్ విజయాన్ని పురస్కరించుకుని విక్టరీ పరేడ్ కోసం మాతో చేరండి” అంటూ రాసుకొచ్చారు. “మాతో వేడుకులో పాల్గొనడానికి జూలై 4న సాయంత్రం 5:00 గంటల నుంచి మెరైన్ డ్రైవ్, వాంఖడే స్టేడియంకు తరలి రండి. ఈ తేదీని గుర్తించుకోండి” అని పేర్కొన్నారు.
టోర్నమెంట్ ముగిసిన తరువాత బార్బడోస్‌లోని వాతావరణ దృష్ట్యా ఇండియాటీమ్ అక్కడే ఉండిపోయింది. దీంతో బీసీసీఐ ప్రత్యేక విమానంలో టీమ్‌ను ఇండియాకు తీసుకొస్తుంది. జులై 4న ఉదయం 6 గంటలకు టీమిండియా న్యూఢిల్లీకి చేరుకుంటుంది. ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ విజేతలను తన నివాసంలో సత్కరించనున్నారు. ఆ తరువాత భారత జట్టు ముంబైకి బయలుదేరనుంది. ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీసీసీ కోచ్‌లు, సహాయక సిబ్బందితో సహా జట్టు సభ్యులను బీసీసీఐ సత్కరిస్తుంది. ఈ టోర్నమెంట్ విజేతలకు అందించే రూ. 125 కోట్ల నగదు బహుమతిని అందజేస్తుంది.
బీసీసీఐ కార్యదర్శి జై షా సహా టీమ్ఇండియా క్రికెటర్లు, సహాయక సిబ్బంది, స్పోర్ట్స్ జర్నలిస్టులు అందరితో కలిసి మొత్తం 70 మంది అదే విమానంలో వస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పూర్తయిన వెంటనే ఇండియా బయలుదేరి రావాల్సింది. కానీ బెరిల్ తుపాన్ కారణంగా ఆటగాల్లతో పాటు అందరూ అక్కడే చిక్కుకుపోయారు. కప్ సాధించుకొని వస్తున్న వీరుల్ని సత్కరించడానికి దేశమంతా ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తోంది.
??? Join us for the Victory Parade honouring Team India's World Cup win! Head to Marine Drive and Wankhede Stadium on July 4th from 5:00 pm onwards to celebrate with us! Save the date! #TeamIndia #Champions @BCCI @IPL pic.twitter.com/pxJoI8mRST
— Jay Shah (@JayShah) July 3, 2024
??, we want to enjoy this special moment with all of you.
So let’s celebrate this win with a victory parade at Marine Drive & Wankhede on July 4th from 5:00pm onwards.
It’s coming home ❤️?
— Rohit Sharma (@ImRo45) July 3, 2024

