»Aanvi Kamdar Social Media Influencer Young Woman Dies While Making Reels
Aanvi Kamdar: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. రీల్స్ చేస్తూ యువతి దుర్మరణం
ప్రస్తుతం యువత ఎక్కువగా సామాజిక మాధ్యమాలకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సాహోసతపూరితమైన రీల్స్ చేస్తూ.. ఫేమస్ కావాలని చూస్తున్నారు. అయితే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ చేస్తూ తన ప్రాణాన్ని కోల్పోయింది.
Aanvi Kamdar: Social media influencer.. Young woman dies while making reels
Aanvi Kamdar: ప్రస్తుతం యువత ఎక్కువగా సామాజిక మాధ్యమాలకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సాహోసతపూరితమైన రీల్స్ చేస్తూ.. ఫేమస్ కావాలని చూస్తున్నారు. అయితే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ చేస్తూ తన ప్రాణాన్ని కోల్పోయింది. ఆన్వీ కామ్దార్ అనే యువతి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు తెచ్చుకుంది. ముంబాయిలో నివాసం ఉంటున్న ఆమె స్నేహితులతో కలిసి కుంభే జలపాతానికి వెళ్లారు. ప్రకృతి అందాల మధ్య ఆ జలపాతాల సోయగాన్ని రీల్స్ చేయాలనుకున్నారు. అక్కడే ఓ లోయకు అంచున ఉండి రీల్స్ చేస్తున్నారు. ప్రమాదవశాత్తు ఆమె కాలు జారి 300 అడుగులు ఉన్న లోయలోకి పడిపోయారు.
స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి ఆరు గంటల పాటు శ్రమించి ఆమెను బయటకు తీసుకొచ్చారు. లోతులో పడటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. ఆన్వీకి ఇన్‌స్టాలో 2.56 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె చేసిన పోస్ట్‌లకు మిలియన్ల కొద్దీ వ్యూస్ ఉన్నాయి. దేశ విదేశాల్లో అనేక ప్రాంతాలను సందర్శిస్తూ అక్కడి విశేషాలను పంచుకుంటూ తన ఫాలోవర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఆమె వృత్తిరీత్యా ఛార్టెర్డ్ అకౌంటెంట్. డెలాయిట్‌లో పనిచేశారు. ఇన్‌స్టా బయోలో ఆమె తనని తాను ట్రావెల్ డిటెక్టివ్‌గా రాసుకున్నారు.