దాదాపు 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ విజేతగా భారత జట్టు నిలిచింది. అయితే టీమ్ఇండియాకి బీసీసీఐ 125 కోట్లు నజరానా కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నజరానాను ఎవరెవరూ? ఎంత? పంచుకున్నారో తెలుసుకుందాం.
BCCI: దాదాపు 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ విజేతగా భారత జట్టు నిలిచింది. అయితే టీమ్ఇండియాకి బీసీసీఐ 125 కోట్లు నజరానా కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నజరానాను ఎవరెవరూ? ఎంత? పంచుకున్నారో తెలుసుకుందాం. టీమ్ఇండియా ప్రపంచకప్ కోసం మొత్తం 42 మంది సభ్యుల బృందం వెళ్లింది. ఇందులో 15 మంది ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, రిజర్వ్ ఆటగాళ్లు ఉన్నారు. అయితే భారత జట్టులోని 15 మంది సభ్యులకు ఒక్కో ఆటగాడికి రూ.5 కోట్లు అందించనున్నారు. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కూడా రూ.5 కోట్లు అందుకుంటారు.
కేవలం బీసీసీఐ ఆటగాళ్లకు మాత్రమే కాకుండా సహాయక సిబ్బందికి కూడా పంపిణీ చేసింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేలకు రూ.2.5 కోట్లు అందించనుంది. బ్యాక్ రూమ్ స్టాఫ్ సిబ్బంది, ముగ్గురు ఫిజియోథెరపిస్ట్‌లు, ముగ్గురు త్రోడౌన్ స్పెషలిస్టులు, ఇద్దరు మసాజర్లు, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌లకు ఒక్కొక్కరికి రూ.2 కోట్లు అందజేయనున్నారు. అలాగే సెలక్షన్ కమిటీ సభ్యులు, రిజర్వ్ ఆటగాళ్లు అయిన రింకూ సింగ్, శుభమన్ గిల్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లకు ఒక్కొక్కరికి కోటి రూపాయిలు ఇవ్వనున్నారు.