»A Huge Accident In Indonesias Gold Mine 11 People Died
Gold mine: బంగారు గనిలో భారీ ప్రమాదం.. 11 మంది మృతి
బంగారు గనిలో కొండచరియలు విరిగిపడడంతో 11 మంది మృతి చెందారు. మొత్తం గనిలో 33 మంది పని చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన మరో 20 మంది కోసం అధికారులు గాలిస్తున్నారు.
A huge accident in Indonesia's gold mine.. 11 people died
Gold mine: బంగారు గనిలో పనిచేసే కార్మికులు ప్రాణాలు అరిచేతులో పెట్టుకొని చేస్తారు. మైనింగ్ చేస్తున్నప్పుడు చాలా రకాలు వాయువులు, వేడి వస్తుంది. ఇదే కష్టం అంటే అప్పుడప్పుడు కొండచరియలు విరిగిపడడం. భూమి లోపల మట్టి దిబ్బలు కిందపడడం వంటివి జరుగుతుంటాయి. అలాంటిదే ఇండోనేషియా, సులవేసి ద్వీపంలోని ఓ బంగారు గనిలో చోటుచేసుకుంది. ఈ భారీ ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు సైతం కోల్పోయారు. దీనికి ముఖ్య కారణం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలే అని తెలుస్తుంది. వారం రోజులు వరుసగా వర్షాలు పడుతున్న కార్మికులు గనిలో పని చేస్తున్నారు. ఆదివారం ఒక్క సారిగా కొండ చరియలు విరిగిపడడంతో 11మంది కార్మికులు మృతి చెందారు. ఇదే విషయాన్ని అధికారులు వెల్లడించారు.
అంతర్జాతీయ వార్తా కథనాల ప్రకారం.. గోరంటాలో ప్రావిన్స్‌లోని రిమోట్ బోన్ బొలాంగో ప్రాంతంలో అక్రమంగా గని తవ్వకాలు చేపట్టారు. దానికోసం 33 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో బంగారు గనిలో పనులు చేస్తుండగా కొండ చరియలు ఒక్కసారిగా విరిగి పడ్డాయి. అవి నేరుగా కార్మికులపైనే పడినట్లు గోరంటా సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ప్రతినిధి అఫీఫుద్దీన్ ఇలాహుడే వెల్లడించారు. వెంటనే రక్షణ బృందాలు సహాయక చర్యల్లో దిగాయి. మొత్తం 33 మందిలో ఒకరిని ప్రాణాలతో రక్షించారు. సోమావారం ఉదయం 11 మృతదేహాలను తీశారు. మరో 20 మంది కోసం అధికారులు గాలిస్తున్నారు. అయితే ఇలాంటి అక్రమ మైనింగ్ తవ్వకాలు ఇండోనేషియాలో సర్వసాధారణమని అధికారులు చెబుతున్నారు.