»Pakistan Father Buries Daughter With Full Of Life
Pakistan: నిండు ప్రాణంతో కన్నకూతురిని సమాధి చేసిన తండ్రి
పాకిస్థాన్లో ఓ తండ్రి నిండు ప్రాణంతో ఉన్న తన కన్నకూతురిని పొట్టన పెట్టుకున్నారు. పుట్టిన 15 రోజులకే ఆ పసికందును సమాధి చేశాడు. దానికి అతను చెప్పిన కారణం వింటే షాక్ కావాల్సిందే.
Pakistan: Father buries daughter with full of life
Pakistan: పాకిస్థాన్లోని సింధ్ ప్రాంతానికి చెందిన తయ్యబ్ భార్య 15 రోజలు క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టినప్పటి నుంచి ఆ పసికందు ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదు. అయితే చికిత్స చేయించేందుకు డబ్బు లేకపోవడంతో, బతికుండగానే ఆ బిడ్డను తయ్యబ్ గొయ్యితీసి పాతిపెట్టాడు. ఓ గోనె సంచిలో తీసుకెళ్లి, థారుశాహ్ ప్రాంతంలో సమాధి చేసినట్లు పోలీసుల ఎదుట నేరం ఒప్పుకున్నాడు. అతను చెప్పిన కారణంతో పోలీసులు షాక్ అయ్యారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫొరెన్సిక్ పరీక్ష నిమిత్తం కోర్టు ఆదేశాల ప్రకారం ఆ సమాధిని తవ్వనున్నట్లు సమాచారం. అయితే గతంలో కూడా పాకిస్థాన్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. ముఖం ఆకృతి సరిగ్గా లేదని పుట్టిన రెండు రోజులకే ఓ తండ్రి తన బిడ్డను సజీవంగా పాతిపెట్టి జైలుకు వెళ్లాడు.