It is sad that Chandrababu Naidu died of diarrhea in Vijayawada
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో డయేరియా మహమ్మారి కబలిస్తోంది. గత వారం రోజుల వ్యవధిలో 9 మంది ఈ వ్యాది భారీన పడి చనిపోయారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. విజయవాడంలో డయేరియి మరణాలు అత్యంత భాదాకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాధి భారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని బాబు ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత నీరు వలనే ప్రజలకు ఈ వ్యాధి సోకుతుందని పేర్కొన్నారు. దీనిపై అధికారులు స్పందించాలని తెలిపారు.
కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని, ఇప్పటికే రోగులు చనిపోతున్నారు అని అన్నారు. డయేరియాతో చనిపోయిన రోగులు కారణం ఇది కాదు ఇతర ఆరోగ్య సమస్యల వలన అని అధికారులు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ప్రజలకు అవవగాహన కల్పించాలి కానీ తప్పుడు సమాచారం ఇవ్వకూడదు అని హితవు పలికారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వెంటనే కలుషిత నీరు సరఫర నిలిపేయాలని, మంచి నీళ్లను అందించాలని చంద్రబాబు పేర్కొన్నారు.