Plane crash: పారిస్ నగరంలోని ఓ విమానం నడి రోడ్డుపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. అయితే ఈ ఫ్లైట్ తక్కువ ఎత్తులో ఎగురుతుండమే కారణం అని తెలుస్తుంది. ఈ క్రమంలో ఓ విద్యుత్ తీగ తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఈ విమాన ప్రమాదంలో మొత్తం ముగ్గురు చనిపోయారు. మిగితావారు గాయాలపాలయ్యారు. వెంటనే స్పందించిన రెస్క్యూ సిబ్బంది క్షతగాత్రులను ఎయిర్ ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పారిస్ నగరంలోని డిస్నీల్యాండ్ సమీపంలో ఏ4 మోటార్ వే పై ప్యాసింజర్ విమానం అకస్మాత్తుగా కూలింది. గాల్లోనే విమానం తలకిందులుగా రోడ్డుపై పడింది. దాంతో అందులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు స్పాట్లోనే చనిపోయారు. ఆ సామయంలో రోడ్డుమీద వెళ్తున్న వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. గాయాలపాలైన వారిని ఎయిర్ అంబులెన్స్‌లలో హాస్పటల్‌కు తీసుకెళ్లారు. దీంతో ఈ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రెస్క్యూ టీమ్ విమానం శకలాలను తొలగించారు.