»Accidents Are More Likely To Happen When It Rains Do You Know Why
CyberabadTrafficPolice: వర్షం పడే సమయంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ.. ఎందుకో తెలుసా?
వర్షం పడే సమయంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా అవుతాయి. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. కారణాలేంటి? వాటి నుంచి ఎలా జాగ్రత్త పడాలో ప్రతీ వాహనదారుడు తెలుసుకోవాలి.
Accidents are more likely to happen when it rains. Do you know why?
CyberabadTrafficPolice: రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా స్పీడ్ డ్రైవింగ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వలనే జరుగుతుంది. మాములు సమయం కన్నా ఎక్కువగా వర్షకాలంలో జరుగుతాయి. అయితే వర్షం పడేప్పుడు రోడ్డు తడిగా ఉంటుంది. అందువల్ల బ్రేకులు పడవు అని చాలా అంది చెబుతుంటారు. అయితే వర్షం నీళ్లు రోడ్లమీద నిలవడంతో పెద్ద గుంటలు సరిగ్గా కనిపించవు. దాంతో వాహనదారులు కానక గుంతల గుండా నడపడం ద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే రోడ్డుపై నీళ్లు ఉండడం వలన రోడ్డుకు, వెహికిల్ టైర్లకు మధ్య ఘర్షణ సామర్థ్యం తగ్గుతుంది దీంతో కావాల్సిన స్థలంలో బ్రేక్ పడదు. దీంతో ఆక్సిడెంట్స్ అవుతాయి. వీటితో పాటు ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే వాటిని అధిగమించాలంటే వీటిని పాటించాలి.
వాహనం రోడ్డు ఎక్కేముందు టైర్లలో గాలి సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. బ్రేకులు పడుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి. మిర్రర్స్ సరిగ్గా ఉండాలి. కచ్చితంగా ఫ్రెంట్ గ్లాసును, మిర్రర్స్‌ను క్లీన్ చేసుకోవాలి. వీటితో పాటు ఫ్లై ఓవర్స్‌లో వెళ్లేప్పుడు ఆదేశించిన స్పీడ్ మించకుండా బండి నడపాలి. సడన్ బ్రేకులు ఎట్టి పరిస్థితులో వేయరాదు. అలాగే మాములు సమయంలో కన్నా వర్షం పడే సమయంలో రెండు వాహనాల నడుమ దూరం ఎక్కువగా ఉండాలి. వీటిని కచ్చితంగా పాటించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ వీడియోను పెట్టారు. ప్రస్తుతం దీన్ని ప్రజలు విపరీతంగా షేర్స్ చేస్తున్నారు.