»Yellow Alert For Rains In Telangana State For Next Five Days
Yellow alert: రాష్ట్రంలో రాగల ఐదురోజులు వర్షాలు.. ఎల్లో అలెర్ట్
తెలంగాణ వ్యాప్తంగా రాగల ఐదురోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
Yellow alert for rains in Telangana state for next five days
Yellow alert: తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు అడపాదడపా కురుస్తున్న వర్షాలకు వ్యవసాయ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో రాగల ఐదురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం, శుక్రవారం, శనివారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి జల్లులు పడుతాయని, కొన్ని ప్రాంతాల్లోల మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే ఆదివారం, సోమవారం పలు జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అందులో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు ఉన్నాయి. దాదాపు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఇక సోమవారం మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, జనగాం జిల్లాలో భారీ వానలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలే కాకుండా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయని.. ఆ ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు ఉన్నట్లు ఈ జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.