China: Bridge collapsed due to floods, 11 people died
China: ఆకస్మికంగా చైనాలో వరదలు కురుస్తున్నాయి. ఈ వరదలకు అక్కడ ఓ వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మరో 30 మంది గల్లంతయ్యారు. జాసుయి కౌంటీలో ఉన్న డానింగ్ ఎక్స్‌ప్రెస్‌వే నుంచి నదిలో వాహనాలు పడిపోయాయి. వంతెన కూలిపోయే సమయంలో బ్రిడ్జ్‌పై ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. కుండపోత వర్షాలు, వరదల కారణంగా ఈ వంతెన కూలిపోయినట్లు సమాచారం. రెస్క్యూ టీమ్ వెంటనే నదిలో పడిపోయిన వాహనాలను బయటకు తీశారు. చైనాలోని షాంగ్సీలోని బావోజీ నగరంలో వర్షం కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల చాలా నష్టం జరిగింది. దీని కారణంగా దాదాపు ఐదుగురు మరణించారు.. మరో ఎనిమిది మంది గల్లంతు అయ్యారు.